అమెరికాలో ఎట్టకేలకు సుదీర్ఘ షట్‌డౌన్ ముగిసింది. ఈ మేరకు 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దీంతో 43 రోజుల సుదీర్ఘ షట్‌డౌన్‌కు అధికారికంగా ముగింపు లభించింది.