Donald Trump: రాబోయే 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించకపోతే రష్యాపై "తీవ్రమైన సుంకాలు" విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. ‘‘మేము సెకండరీ టారిఫ్‌లు అమలు చేయబోతున్నాం. 50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే, అవి 100 శాతం ఉంటాయి.’’ అని సోమవారం వైట్‌హౌజ్‌లో విలేకరులతో ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ ఆపకపోవడంపై ట్రంప్ చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.