Pakistan: అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.