భారత్ పై అమెరికా 50 శాతం భారీ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, భారతదేశ వాణిజ్య విధానాలను విమర్శిస్తూ, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్, న్యూఢిల్లీ ప్రపంచ వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోందని, మార్కెట్ ప్రాప్యతను పరిమితం చేస్తోందని ఆరోపించారు. ఆక్సియోస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, లుట్నిక్ మాట్లాడుతూ.. భారతదేశం తన జనాభా 1.4 బిలియన్లు అని గొప్పలు చెప్పుకుంటుందని, మరి మన నుండి ఒక బుషెల్ (25.40 కిలోలు) మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం…