ఎట్టకేలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్తీ ఎన్నికయ్యారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి పలువురు నేతలు మద్దతు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ(82)పై దాడి చేసి గాయపరిచాడు.