Urea : తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యూరియా నిల్వలను పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి భారీగా యూరియా స్టాక్ చేరుతుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభమయ్యే రబీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈసారి యూరియా కొరత రాకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో…