VC Sajjanar : టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “జంప్‌డ్ డిపాజిట్ స్కామ్” పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందేశంలో భాగంగా, స్కామ్ వివరాలు తెలియజేసే వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన హెచ్చరిస్తూ, “మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమయితే సంబరపడిపోకండి.…