Test-20: క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. "టెస్ట్ -20" పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్‌లా రెండు ఇన్నింగ్స్ ఉండగా, టీ20 తరహాలో వేగంగా సాగబోయే ఈ కొత్త రూపం అభిమానులకు వినూత్న అనుభూతిని ఇవ్వబోతోంది. ఛాంపియన్షిప్ టోర్నీలాగా ఆడించాలని నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాణీ భావిస్తున్నారు.