ఉత్తరప్రదేశ్‌లో నాలుగోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరగనుంది. తొలి మూడు దశల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక నాలుగో దశ ఎన్నికల్లో 624 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్‌బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్, యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా “వీడియో కాన్ఫరెన్స్ ” లో ఓటర్లతో మాట్లాడిన ఆమె.. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి.. రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు చాలా కీలకం అన్నారు.. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదన్న ఆమె… ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తప్ప ప్రభుత్వం చేసింది…
ఎన్నికలు జరుగుతున్న యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ ముఖ్యమంత్రి యోగిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి యోగి నిష్కళంకుడు. ఏ మాత్రం అవినీతి మచ్చలేని సమర్ధుడైన నాయకుడు. రాష్ట్ర హితం, దేశ హితం కోసం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రకాశ్ సింగ్. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లో అన్సారీ చీకటి సామ్రాజ్యాన్ని యోగి ప్రభుత్వం ధ్వంసం చేసింది. అలా ఎంతోమంది గూండా గిరి చేసిన వాళ్లందరినీ యోగి ప్రభుత్వం…
యూపీ ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన యూపీ ఎన్నికలు దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయనడంతో అతిశయోక్తి లేదు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఎన్నికల ముందు ఆయాపార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ కీలక నేత ఆజంఖాన్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన జైలులో వున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను జైలు నుంచే దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో…
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి… మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రణాళికలతో ముందుకు కదులుతోంది బీజేపీ.. ఇదే సమయంలో.. ఓ వైపు ప్రియాంక నేతృత్వంలో కాంగ్రెస్, మరోవైపు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ, మాయావతి నేతృత్వంలో బీఎస్పీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, సీఎం యోగి ఆదిత్యానాథే మరోసారి సీఎం అవుతారనే ప్రచారం కూడా ఉంది.. అంతేకాదు.. మోడీ తర్వాత అంతటి చరిష్మా ఉన్న యోగీయే నంటూ కొంతకాలం ప్రచారం సాగింది.. కానీ,…
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధించడానికి అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఓవైపు, మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతుంటూ.. ఇంకా వైపు.. ప్రతీ అంశాన్ని క్యాచ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.. ఎస్పీ, బీఎస్పీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి గట్టి…