Ghazipur Encounter: గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు. జాహిద్ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించినట్లు ఘాజీపుర్ జిల్లా ఆస్పత్రిపై వైద్యులు ప్రకటించారు. ఆగస్టు 20న అర్ధరాత్రి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్లు జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్‌లు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో…