Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్‌లోని తన అత్తమామల ఇంటికి వెళ్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు. నిందితుడు కల్లు అలియాస్ ధర్మేంద్ర పాశ్వాన్(34) కాన్పూర్ నగరంలోని సేన్ వెస్ట్ పారాలో బాధితురాలు 29 ఏళ్ల మహిళ ఉంటున్న పరిసర ప్రాంతంలోనే నివసిస్తున్నాడు.