Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం అలీఘర్, హత్రాస్‌లో పర్యటించారు. ఇక్కడికి చేరుకున్న ఆయన హత్రాస్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో 121 మంది మృతికి కారణమైన హత్రాస్ భోలే బాబాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం భోలే బాబా దర్శనంపై పెద్ద ఎత్తున భక్తులు ఎగబడడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.