ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ని ఓడించి.. మూడోసారి ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో విరాట్ ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కింగ్ ఔట్ అవ్వగానే ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.…