Unregulated lending: లోన్ యాప్‌ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది.