సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖరాశారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.