ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంలో రీక్యాంప్ ఉంటుందని అంచనాలు. ఇది GST మోడల్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ జియోపాలిటికల్ అస్థిరతల నేపథ్యంలో.. ఆర్థిక వేగాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.
Budget History: ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీకి కోసం దేశం ఎదురుచూస్తోంది. దేశంలోని ప్రముఖ పార్టీలు, అన్ని రాష్ట్రాలతో పాటు ఆర్థిక వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి హోదాలో ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019 జూలై 5న నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ చదివారు. అప్పటి నుంచి ఏటా ఆమె బడ్జెట్ ప్రవవేశపెడుతున్నారు. అయితే.. మోడీ…