Budget History: ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీకి కోసం దేశం ఎదురుచూస్తోంది. దేశంలోని ప్రముఖ పార్టీలు, అన్ని రాష్ట్రాలతో పాటు ఆర్థిక వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి హోదాలో ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019 జూలై 5న నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ చదివారు. అప్పటి నుంచి ఏటా ఆమె బడ్జెట్ ప్రవవేశపెడుతున్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం 92 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేసింది. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటి? 92 ఏళ్లుగా ఏం జరిగింది? అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: Police Raids: రోజువారీ కూలీ ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. కోటిన్నర విలువైన బంగారం, వెండి చూసి షాక్..!
వాస్తవానికి.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో పాత పద్ధతులు మారిపోయాయి. చాలా కాలంగా కొనసాగిన రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి ఎన్డీఏ ప్రభుత్వం స్వస్తి పలికింది.. ఒకప్పుడు బడ్జెట్ అంటే రెండు రోజుల కథ. మొదటి రోజు రైల్వే బడ్జెట్, రెండో రోజు సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు. ఇది దాదాపు 92 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం. భారత బడ్జెట్ చరిత్రను చూస్తే, రైల్వే బడ్జెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు దేశ అభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర పోషించేది. అందుకే రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉండేది. విద్య, ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలు సాధారణ బడ్జెట్‌లో ఉంటే.. రైళ్లకు సంబంధించిన కొత్త లైన్లు, టికెట్ ధరలు, స్టేషన్లు, సదుపాయాలు అన్నీ రైల్వే బడ్జెట్‌లో ప్రకటించేవారు.
READ MORE: Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..
1924లో బ్రిటిష్ పాలన సమయంలో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా సాధారణ బడ్జెట్‌కు ఒక రోజు ముందే రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేవారు.స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ పద్ధతి అలాగే కొనసాగింది. రైల్వే బడ్జెట్ రోజు అంటే ప్రయాణికులు టికెట్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? కొత్త లైన్లు ఎక్కడ కేటాయించారు? అని ఉత్కంఠగా ఎదురు వాళ్లు. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాత సంప్రదాయంపై కొత్త ఆలోచన మొదలైంది. చివరకు 2017లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లోనే కలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 92 ఏళ్ల చరిత్రకు తెరపడింది. ఆ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ అనే ప్రత్యేక కార్యక్రమం లేకుండా.. ఒకే రోజు ఒకే బడ్జెట్‌లో అన్ని అంశాలు ప్రకటించే విధానం మొదలైంది.
READ MORE: Suryakumar Yadav: విజయానికి కారణమైన ఇషాన్ కిషన్‌పై కెప్టెన్ ఫైర్.. ఎందుకో తెలుసా?
మొదటిసారి కామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2017లో ఆయన సాధారణ బడ్జెట్ చదువుతూనే రైల్వేకు సంబంధించిన అంశాలన్నీ అదే ప్రసంగంలో చెప్పారు. రైల్వే బడ్జెట్ రోజు లేకపోవడం, ప్రత్యేకంగా రైళ్లపై ప్రకటనలు వినిపించకపోవడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని మార్చాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. రైల్వే సైతం దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమే కాబట్టి, దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. అదే ఆలోచనను ప్రభుత్వం అమలు చేసింది.