ఈ రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది.
UPI Outage: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విఫలమవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలువురు నెటిజన్లు ఎక్స్(ట్విట్టర్)వేదికగా అంతరాయం గురించి ట్వీట్స్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో పాటు బ్యాంకింగ్ రంగం దేశవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో ఈ రోజు సాయంత్రం డిజిటల్ చెల్లింపుల్లో అవాంతరాలు ఎదురయ్యాయి.