CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్ట్-అప్స్ లో గూగుల్ ఒకటని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా... ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్ట్-అప్ ను ప్రారంభించారు.