మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…