ఉద్యోగం పేరు చెబితే ఎన్ని లక్షలైనా ఖర్చుచేయడానికి వెనుకాడని రోజులివి. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను సినిమాల్లో సైతం కామెడీగా చూపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డు ఘరానా మోసం బయటపడింది. కరోనా కారణంగా నలుగురు హోంగార్డులు చనిపోయారు వారి పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని మీకే వచ్చేలా చూస్తానంటూ అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ..ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి లక్షల వసూలు చేశాడో హోం గార్డు.…
తెలంగాణ ఉద్యమం, అనంతరం తెలంగాణ సాధన విషయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మరోమారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం.. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్. ఈ రోజు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు.. ఒకప్పుడు…
ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల…
చదివిన చదువుకు తగిన ఉద్యోగం కావాలని నిరుద్యోగులు కోరుకుంటారు. కానీ వారి ఆశలు ఆవిరవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ సరైన ఉద్యోగాల భర్తీ జరగలేదు. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు అవుతోంది. వయసు మీదపడుతోంది. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగులకు ఇబ్బందిగా మారాయి. దీనికి తోడు చిన్నాచితకా ఉద్యోగాలు చేద్దామన్నా కరోనా మహమ్మారి వల్ల అవి కూడా కుదరడం లేదు. రాష్ట్రంలోని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జంబో ఉద్యోగ ప్రకటన ఇంకెప్పుడు…
పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా…