శ్రీలంకలో దారుణపరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే వున్నారు. కొలంబోలోని పార్లమెంటు భవనం ముందు అండర్ వేర్లతో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందడం లేదు. ఎప్పుడూ లేనివిధంగా ధరలు అంతరిక్షాన్ని తాకాయి. దేశం దివాలా అంచున నిలిచింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ప్రజలు, విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు…