నాలుక రంగులో మార్పులు కూడా ఇన్ఫెక్షన్ లేదా అనేక రకాల తీవ్రమైన వ్యాధుల వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాలుక సాధారణంగా లేత ఎరుపు-గులాబీ రంగులో ఉంటుంది. అలా కాకుండా.. అసాధారణమైన మార్పు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. మన నాలుక శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.