బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భారీ అంతస్తు బిల్డింగ్ కూలిపోయింది.
మహారాష్ట్రలోని ముంబైలో పెను ప్రమాదం జరిగింది. మలాద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. ఈస్ట్ మలాడ్‌లోని గోవింద్ నగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:10 గంటలకు ఈ ఘటన జరిగింది.
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. అందులో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.