వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్)ని మనీలాండరింగ్ నిరోధక చట్టం( పిఎంఎల్‌ఎ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.