కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కీలకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీ వివరాలను ఆయన సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి తెలిపారు. తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ప్రధాన…