తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.