అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని ఎంపీ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు లాంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైనదని అన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా తాను నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు.
USA: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీసీ) సమావేశాలకు ముందు అమెరికాలో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టెలికాం సేవల్ని నిలిసేందుకు పన్నిన కుట్రను యూఎస్ సీక్రెట్ సర్వీస్ మంగళవారం భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా, అనేక దేశాధినేతలు ప్రసంగించే సమయంలో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో తొలి ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది.
Modi Trump meeting: సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ప్రధాని మోడీ – ట్రంప్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని పలు నివేదికలు వెలువడుతున్నాయి. ట్రంప్‌ను కలవడంతో పాటు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నాయకులతో కూడా ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఓ…