UN Economic Report: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2024లో కూడా భారత వృద్ధి 6.2 శాతానికి చేరుకోగలదని యూఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక తెలిపింది. భారత వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని, అయితే ఇది 2023లోని 6.3 శాతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని యూఎన్ రిపోర్ట్ అంచనా…