భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(1)ను న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. మన బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు ఆటలో ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్…