ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరో సరికొత్త సీరియల్‌ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాలనే పథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’. ఈ సీరియల్లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్ 4న ప్రారంభం,…