దేశీయ క్రీడలకు నెమ్మదిగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ప్రొ.కబడ్డీ లీగ్ వంటి టోర్నీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఖోఖో క్రీడకు సంబంధించి ఓ మెగా లీగ్ రాబోతోంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న అల్టిమేట్ ఖోఖో లీగ్(యూకేకే)లో తెలంగాణకు చెందిన టీమ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేసింది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) సహకారంతో ఖోఖో లీగ్‌ను డాబర్ గ్రూప్ ఛైర్మన్ అమితక బర్మన్ ఏర్పాటు చేయగా పలు రాష్ట్రాల నుంచి ఫ్రాంచైజీలు…