ఉక్రెయిన్-రష్యా సంక్షోభం తారా స్థాయికి చేరింది. అమెరికా ఆశపడ్డట్టు ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యక్ష దాడి చేయలేదు. కానీ, అంతకు మించిన షాక్ ఇచ్చింది ప్రపంచ పెద్దన్నకు. పుతిన్ దురాక్రమణకు దిగాడని అమెరికా గగ్గోలు పెడుతోంది. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ప్రెసిడెంట్ బైడెన్ ఆరోపించారు. ఆంక్షల పర్వానికీ అమెరికా తెరలేపింది. రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలు వీఈబీ, రష్యా మిలిటరీ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అలాగే అక్కడి ఉన్నత వర్గాలు, వారి కుటుంబాలపై కూడా ఆంక్షలు పెట్టనుంది.…