ఉక్రెయిన్‌పై రష్యా దాడి రెండో నెలలోకి ప్రవేశించింది. ఐదు వారాలుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న దాడులకు ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. జరుగుతున్న రక్తపాతానికి ఉక్రెయిన్ ప్రజలు హడలిపోతున్నారు. పిల్లలకు స్కూళ్లు లేవు. వైద్యం లేదు. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఏ ప్రాంతం కూడా సురక్షితం అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజధాని కీవ్‌లో దాదాపు కోటి మంది సురక్షిత ప్రాంతాలను వెతుక్కోవటానికి ఇల్లు వీడి వెళ్లిపోయారు.…