ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. 50 రోజులు గడిచినా యుద్ధం ఆగడం లేదు.. ఇక, రష్యా బలగాలకు ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది.. తాజా దాడుల్లో కీవ్, ఖెర్సన్, ఖార్కివ్ మరియు ఇవానో-ఫ్రాన్కివ్స్క్ లాంటి నగరాల్లో భారీ నష్టం జరిగినట్టు చెబుతున్నారు.. మరోవైపు.. ఉక్రెయిన్‌ను మేం ఉన్నామంటూ ప్రకటిస్తూ వస్తున్న అమెరికా.. ఆ దేశానికి భారీ సాయం చేసింది.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు మరో 80కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురవుతున్నా.. యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో చాలా సంస్థల ఆ దేశానికి గుడ్‌బై చెప్పేస్తున్నాయి.. తాజాగా, రష్యాకు ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా షాక్ ఇచ్చింది. రష్యా మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై రష్యా విపణిలో తమ ఉత్పత్తులను విక్రయించబోమని తేల్చి చెప్పింది. ఫిన్లాండ్‌కు చెందిన ఈ దిగ్గజ కంపెనీ..…
మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. ధరల మాట వింటే సామాన్యుడు షాక్ అవుతున్నాడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ , వంట నూనెల పెరుగుదలలో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు మెడిసిన్స్ ధరలు పెరుగుతుండడంతో కొనేదెలా అని కలవరపడుతున్నాడు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది చివరికి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ఎక్కడో రష్యా-ఉక్రెయిన్ యుద్దం వల్ల ఇండియాలో వంట నూనెలు,…
ఉక్రెయిన్‌పై సరిగ్గా నెల కిందట యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోయింది. కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్‌లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని…
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి రప్పించడానికి భారత ప్రభుత్వం కూడా చేయాల్సిందంతా చేస్తోంది. ఆపరేషన్ గంగ అంటూ స్పెషల్ విమానాలు వంటివి ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓ భారతీయ డాక్టర్ మాత్రం తన పెంపుడు జంతువుల కోసం ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన పెంపుడు జంతువులను ఇక్కడ కూడా…
జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. కానీ కొన్ని అవకాశాలు అనుకోని వరంలా వచ్చిపడతాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ విషయంలో కూడా అదే జరిగింది. సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ రెండు సార్లూ విఫలమయ్యాడు. తరువాత అమెరికా సైన్యంలో అయినా చేరుదామనుకుని చెన్నయ్‌లోని అమెరికన్ కాన్సులేట్‌ని సంప్రదించాడు. అక్కడా అతనికి నిరాశే ఎదురైంది. దాంతో అతడు పై చదువుల కోసం 2018లో ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడి నేషనల్ ఏరో…
ఏపీలో మండిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా వాడే ఆయిల్ ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు కిరాణా వ్యాపారులు. తిరుపతిలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. అధిక మొత్త0తో వంటనూనెలు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా నూనె ప్యాకెట్ ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు…
ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న దేశం నుంచి బయటపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. వీరిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అపరేషన్ గంగా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఎంసీ నిబంధనలు సడలించింది. ఇప్పటికే కొన్ని వేలమంది మెడిసిన్ చదువుతోన్న విద్యార్థులు భారత్‌లోని…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్‌కు తరలించినట్లు…
ప్రస్తుతం ఉక్రెయిన్ దేశం ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెల్సిందే. రష్యా దేశం.. తమ సైన్యంతో ఉక్రెయిన్ పై దండెత్తింది. గత కొద్దిరోజులుగా ఈ ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఉక్రెయిన్ సైన్యంతో పాటు అమాయక పౌరులను కూడా యుద్దానికి పంపి వారి మరణాలకు కారణమవుతున్నారు ఉక్రెయిన్ ప్రభుత్వం. ఇక ఈ యుద్ధంపై ఎంతోమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలు ఎందుకు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. పలువురు…