రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న వైద్య విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే తీవ్ర ప్రయాసల నడుమ భారత్ చేరుకున్న విద్యార్థుల ఆనందం అంతా ఇంతా కాదు. వారిలో ఏపీకి చెందిన వందల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఏపీ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి పొరుగుదేశాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులందరూ క్షేమంగా…
ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని పోయారు. ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యార్ధుల్ని తరలిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విద్యార్ధుల తరలింపుపై కీలక ప్రకటన చేశారు. రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామన్నారు. పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల్లో చిక్కుకుని పోయారు. తూర్పు ఉక్రేయిన్ లోని “సుమీ” పట్టణంలో చిక్కుకుపోయారు 500 మంది భారతీయ విద్యార్థులు. రష్యా సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే దూరంలో ఉంది సుమీ పట్టణం. వెనువెంటనే తమను రష్యా గుండా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విద్యార్థులు. ఉక్రెయిన్ పశ్చిమ వైపునకు వెళ్లడానికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రస్తుత…