రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరుకుంది.. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని కూడా హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌కు ఉన్న సంబంధాలు తెగిపోయేలా చేసింది రష్యా.. అతిపెద్ద రన్‌వేతో కూడిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశం ఉండడంతో.. కీవ్శివారులోని తమ బలగాల్ని తరలించాలన్నా.. రప్పించాలన్నా రష్యాకు మరింత సులువు…