PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు. శనివారం జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మోడీ, జెలెన్ స్కీ టెలిఫోన్లలో మాత్రమే సంభాషించారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అయినా ఆ యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఓ "అదృశ్య హస్తం" నడిపిస్తోందని చైనా ఆరోపించింది.
India-Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం భేటీ అయ్యారు. మాస్కోల ఈ ఇదద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ విషయానని రష్యాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. "ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సమస్యలపై విస్తృత చర్చ జరిగినట్లు వెల్లడించింది.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఈ నెలలో ఏడాదికి చేరింది. ఏడాది కాలంగా ఇరు దేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ లోని ఖేర్సన్, జపోరొజ్జియా, లూహాన్స్క్, డోనాట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలు, ఇతర నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో రష్యాతో పోరాడుతోంది.
Russia accuses US of plot to eliminate Vladimir Putin to end Ukraine war: ఉక్రెయిన్-రష్యా యుద్ధం పదో నెలకు చేరుకుంది. అయినా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడప్పుడే శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ మరింతగా ఆయుధ సహాయం, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు అమెరికాలో పర్యటించారు. అమెరికా నుంచి పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అంటూ రష్యా…
Russia Says Shot Down 4 US-Made Missiles, 1st Such Claim Since Ukraine War: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రష్యా ఏకపక్షంగా యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఇక ఉక్రెయిన్ కూడా వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంలో రష్యాతో పోరాడుతోంది. అయితే యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశం సర్వనాశనం అవుతోంది. రష్యా, అమెరికాల వివాదం మధ్య ఉక్రెయిన్ యుద్ధ భూమిగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు.…
Russian attacks on Ukraine targeting power grid: విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. శీతాకాలం రావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి దేశం నుంచి వలసలు పెంచాలనే ఆలోచనలతోనే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే విధంగా రష్యా ఆక్రమిత క్రిమియాలో ఇరాన్ జాతీయులు..కామికేజ్ డ్రోన్లను నిర్వహించేందుకు సహాయపడుతున్నారని అమెరికా, ఉక్రెయిన్ ఆరోపిస్తున్నాయి. రష్యాకు సహాయం చేయడానికి ఇరాన్ తన సిబ్బందిని పంపిందని ఆరోపణలు గుప్పించాయి.
Sunflower oil rates may rise due to russia-ukraine war: మళ్లీ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు మరోసారి ధరలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ నగరాలపై భారీగా దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మికోలైన్ మీద క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ట్యాంకులే…
Russia attacks on Ukraine targeting power system: రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకు పడింది. ముఖ్యంగా ఆ దేశ విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో తీవ్రంగా దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉక్రెయిన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు విద్యుత్ వ్యవస్థలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ నాశనం అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. తమ విద్యుత్ వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను…
Russia-Ukraine War: రష్యాలో ఉగ్రవాద దాడి జరిగింది. సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన శనివారం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగింది.