శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు..
శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు దృష్టి సారించారు.
ప్రముఖ శైవ క్షేత్రం ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఇక, ఉగాది వేళ నిర్వహించే మహోత్సవాలకు సిద్ధం అవుతోంది శ్రీశైలం ఆలయం.. శ్రీశైలంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.