తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేసిన సీఎం.. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ…