ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఘోరంగా దెబ్బతింది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయింది. జనవరిలో జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. కూటమిలో పార్టీకి ఆశించ దగ్గ సీట్లు రాలేదు. ఓ వైపు ఈవీఎంలపై నెపం నెడుతున్నా.. ఇంకోవైపు పార్టీలో విభేదాలు మాత్రం కొట్టిచ్చినట్లు కనబడుతున్నాయి.