(జూన్ 26న ఉదయ్ కిరణ్ జయంతి)చీకటిని చీల్చేస్తాయి ఉదయకిరణాలు. పడమటి సంధ్యారాగం వినిపించగానే ఆ కిరణాలు సైతం కరిగిపోతాయి. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ జీవితం తొలి సంధ్యలోని కిరణాల్లా వెలిగి, మలి సంధ్యలోని మసక ముందు ఓడిపోయింది. ఆరంభంలోనే వరుసగా “చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే” చిత్రాల ద్వారా అనూహ్య విజయాన్ని అందుకున్నారు ఉదయ్ కిరణ్. ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించింది. నిజంగా పేరుకు తగ్గట్టే ఉదయ్…