Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్‌లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్‌లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో ఓ యువకుడు గేదెపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. గేదెపై ఆ యువకుడు అత్యాచారం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేయనుంది. ఇప్పటికే ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్‌కు హాజరు కానున్నారు. కాగా ఉదయ్ పూర్‌లో ఎటు…