Burj Khalifa: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న దుబాయ్‌లోని ‘‘బుర్జ్ ఖలీఫా’’పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్లే చేసింది. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణం వెలిగిపోయింది.