Twitter Blue Ticks: ఎలన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్‌లో భారీ మార్పులు సంభవించాయి. గతంలో ట్విట్టర్‌లో బ్లూటిక్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్లూటిక్ కావాలంటే నెలకు రూ.719 చందా కడితే సరిపోతుంది. అయితే ఇప్పుడు నకిలీ ఖాతాలకు కూడా బ్లూటిక్కులు దర్శనమిస్తున్నాయి. దీంతో అసలు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల ఖాతాలకు సంబంధించి ఎక్కువ నకిలీ ఖాతాలకు బ్లూటిక్స్ కనిపిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ దుర్వినియోగం అవుతోందని…