సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా.. కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికార ఖాతా పనిచేయకపోవడం చర్చగా మారింది.. ఇటీవల కేంద్రం కొత్త ఐటీ రూల్స్ తేగా.. ట్విట్టర్ వాటికి అంగీకారం తెలపకపోవడంతో వివాదం మొదలు కాగా.. కొందరు బీజేపీ పెద్దల ఖాతాల విషయంలో ట్విట్టర్ వ్యవహారం కేంద్రానికి మరింత కోపం తెప్పించింది… ఇక, ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోయానని తెలిపారు కేంద్ర మంత్రి…