సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు. అమాయకులైన ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు మరి కొందరు.. రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా నిన్న హ్యాక్‌కు గురైంది. ఆయన ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రిప్టో కరెన్సీ ద్వారా…