తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రచార సభ సమయంలో టీవీకే పార్టీనే పవర్ కట్ చేయమందని తమిళనాడు విద్యుత్తు బోర్డు అంటోంది. తమ పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకే వినతిపత్రం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమకు లేఖ ఇచ్చినట్లుగా విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. తాత్కాలికంగా…
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. దాంతో విజయ్ కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు…