తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, దళపతి విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకుంది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40కి పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులలో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా…