తుల్బుల్ బ్యారేజీ ప్రాజెక్టుపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సీఎం ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ, కొంతమంది ప్రజాదరణ పొందేందుకు, పాకిస్తాన్‌లో కూర్చున్న ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సింధు జలాల ఒప్పందాన్ని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నానని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తూనే ఉంటానని అన్నారు. ఈ ఒప్పందం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు…